శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారు ౧౯౨౮ లో రాసిన మార్గదర్శి కధలోని కొన్ని మార్గదర్శకాలు
"సత్యం గుర్తించగలిగితే బిడ్డల పెంపకంలో బాధ్యతా అంతా తల్ల్లిదే . ఆ విషయంలో తండ్రికంత మమత ఉండదు, శ్రద్ధ , వీలు ఉండదు . అంచేత తండ్రి కంటే తల్లి దగ్గర బిడ్డలకు చనువెక్కువ . ఆ చనువుతోనే తల్లి బిడ్డలను తన అదుపాజ్ఞలలో ఉంచుకోగాలుగుతుంది . ఆ చనువే బిడ్డల మీద pani చేస్తుంది . అలాంటి చనువు చూపించగల తల్లే బిడ్డల జీవిత విజయానికి మార్గాలు పరిష్క్రుతాలు చేసిపెట్ట గలుగుతుంది . అలాంటి తల్లుల కడుపునా పుట్టిన వాళ్ళే లోకంలో గొప్ప పనులు చేసిన వరన్దరునూ , బాగా పరకాఇంచి చూసుకో "
నేను నాది అనే భావాలు ఆది నుంచి ఉంటాయి మనిషికి , ఐతే నీ "అహం" కారానికి గల సత్తా ఈ పాటిదో , నీ "మామ" కారానికి గల దార్ధ్యం ఎంతటిదో ఎప్పుడైనా చర్చిన్చుకున్నావా నువ్వు
మనిషి వల్ల వర్తకం పాడవుతుంది కాని వర్తకం వల్ల మనిషి ఎప్పుడు పాడై పోదు.
ఎవరెన్ని ధర్మ పన్నాలు చెప్పిన ఇహికానికి డబ్బే ప్రధానం , పెట్టుబడి తక్కువ , బుద్హి ఎక్కువాను వర్తక శాస్త్రం లో ఇదొక సూత్రం
మనిషికి వన్నె తెచ్చేది ప్రవార్తనే కాని ఒద్దు పొడుగు కాదు, అల్లాగే రూపై కి వన్నె తెచ్చేది విలువే కాని దాని పనివాడితనం కాదు.
పనిచేసే వాడికి పరికరాలు కాదు ప్రధానం - దీక్ష ఎకాగ్రతాను.
పరపతికి నిదర్సనం అప్పు పుట్టటం కాదు , అణ పైసలతో అది తీర్చి వెయ గలగటం
ధైర్యముగా ముందుకి వెళ్ళు , వెనక బడ్డ వాళ్ళని వెంట పెట్టుకొని ముందుకి వెళ్ళు , సంపాదించు కష్టపడి సంపాదించు ఒకళ్ళని చెరపకుండా సంపాదించు అనుభవించు ఆనందించు . అది ఇహికానికి పరమావధి
బండరాయి చుస్తే దీనిని కడపగలమా అనిపిస్తుంది కాని బుద్ధి ఉంటె దాన్ని కొండ మీదకి ఎక్కించవచ్చు సునాయాసంగా ,
" వాస్తవంగా సంసారం సంగతి కూడా , రెండు కళ్లతోనూ చూస్తామ అది స్వాధీనం లో ఉంటుంది , కళ్ళు ముసుకున్తామ , ఉబిలో ఊర తొక్కేస్తుంది , నేను బడాయి చెప్పుకోవటం కాదు , ఆ నిరాదర స్తితిలో కూడా నీనిలాగే ధైర్యం తెచ్చుకున్నాను , కాని అధైర్యపడలేదు . " నిలవ చేస్తామా లేదా అన్నది వేరే సంగతి , ముందు కాలం గడిపెసుకోగల సత్తా ఉంటె తర్వాత antaa సలక్షనంగానే జరిగిపోతుంది
లోకంలో మనుషుయుల కంటే సంసారం నిర్వహించుకునే ఉపాయాలే ఎక్కువగా ఉన్నాయ్ ,..
తల్లిప్రేమ యెంత గొప్పదొఇ ! దాని తత్త్వం నువ్వెప్పుడైన అర్ధం చేసుకున్నావా? ఏదో సాధించుకు వస్తాడని వీధిలోకి వెళ్ళిన మొగవాన్ని పెళ్ళమైతే , వెళ్ళిన పని ఏమైంది అని అడుగుతుంది, ఐతే అక్కడ ప్రేమకి లోటుండదు , కాని దాని తత్త్వం వేరు. అదే తల్లి ఐతే కులాసాగా వచ్చావ నాయన అని అడుగుతుంది. ఇందులో ఉన్న ఆత్మీయత అందులో ఉండదు
.
నువ్వది అదృష్టం అను లేక మరేదైనా అను , ఒక్కోకప్పుడు అనుకోకుండానే మనకది సంక్రమిస్తూ ఉంటుంది , అలాంటప్పుడు వరసగా మేల్ల్లె కలుగుతూ ఉంటాయి కూడా.
ద్వంద భూ ఇష్టమైన ఈ ప్రపంచంలో నిమిత్త మాత్రంగానైనా ఒకరి ఆసరా లేకుండా ఎవడు పైకి రాలేదు , ఎవరి వల్లనో నువ్వూ అలాంటి ఆసరా పొందావు , సంతోషం , శక్తివంచన లేకుండా నువ్వు ఒకరికి ఆసరా ఇవ్వు . మన ఐశ్వర్యం చూసుకుని మనం అనుభవించే ఆనందం కంటే , మన సాయంతో బాగు పడ్డ వాళ్ళు అనుభవించే ఆనందం మన జీవితానికి ఎక్కువ సాఫల్యం కలిగిస్తుంది.
.
No comments:
Post a Comment